ఇలాంటి ఫోన్ దొంగలు కూడా ఉంటారు... బహుపరాక్!
- హైదరాబాదు శివార్లలో ఘటన
- ఆటో కోసం వేచిచూస్తున్న కుర్రాడు
- కాల్ చేసుకోవాలంటూ ఫోన్ తీసుకున్న వ్యక్తులు
- ఫోన్ తీసుకుని బైక్ పై పరార్
- కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు
చెయిన్ స్నాచర్లు, దృష్టి మరల్చి నగదు దోపిడీ చేసే దొంగల గురించి తెలిసిందే. అయితే, హైదరాబాదు శివార్లలో ఇద్దరు దొంగలు ఓ వ్యక్తి నుంచి సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు. ఓ కాల్ చేసుకుని ఇస్తామనంటూ ఫోన్ అడిగి తీసుకుని ఉడాయించారు. షాపూర్ నగర్ లోని మస్తానా హోమ్స్ లో నివసించే యూసుఫ్ పాషా అనే కుర్రాడు ఆటో కోసం వేచిచూస్తూ బస్టాప్ లో నిల్చుని ఉన్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి, అత్యవసరంగా ఫోన్ కాల్ చేయాలని, కొంచెం ఫోన్ ఇస్తావా అంటూ యూసుఫ్ పాషాని అడిగారు.
పోన్లే పాపం అని యూసుఫ్ తన ఫోన్ వారికిచ్చాడు. ఫోన్ చేతిలో పడడం ఆలస్యం వారిద్దరూ బైక్ పై దూసుకుపోయారు. ఊహించని ఘటనతో యూసుఫ్ పాషా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఘటనపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.