కరోనా ఎఫెక్ట్: వాహన ధ్రువపత్రాల గడువు పెంచిన కేంద్రం 

  • దేశంలో ఇప్పటికీ వ్యాప్తిలో ఉన్న కరోనా
  • కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర రోడ్డు రవాణా శాఖ
  • వాహన సర్టిఫికెట్ల గడువు 2021 మార్చి 31 వరకు పెంపు
  • అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలన్న కేంద్రం
దేశంలో వాహన ధ్రువపత్రాల గడువు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పర్మిట్ సర్టిఫికెట్ల గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచుతున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. 2021 ఫిబ్రవరి 1 నాటికి కాలపరిమితి ముగిసే వాహన పత్రాలకు ఈ గడువు పెంపు వర్తించనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ గడువు పెంపును అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.


More Telugu News