జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న నితీశ్ కుమార్... కొత్త చీఫ్ గా ఆర్సీపీ సింగ్
- బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం
- రాజ్యసభ సభ్యుడు ఆర్సీపీ సింగ్ కు జేడీయూ పగ్గాలు
- గతంలో నితీశ్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సింగ్
- రాజకీయాల్లో చేరి జేడీయూ తరఫున రాజ్యసభకు వెళ్లిన వైనం
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సీఎం నితీశ్ కుమార్ వైదొలిగారు. ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు రామచంద్ర ప్రసాద్ సింగ్ (ఆర్సీపీ సింగ్) కొత్త చీఫ్ గా ఎన్నికయ్యారు. పాట్నాలో ఇవాళ జరిగిన జేడీయూ కార్యవర్గ సమావేశంలో ఆర్సీపీ సింగ్ పేరును నితీశ్ కుమారే ప్రతిపాదించారు. అందుకు పార్టీ సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.
జేడీయూ పగ్గాలు అందుకుంటున్న ఆర్సీపీ సింగ్ కు నితీశ్ తో చాలాకాలంగా అనుబంధం ఉంది. నితీశ్ కుమార్ అప్పట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆర్సీపీ సింగ్ వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించారు. అనంతరం నితీశ్ బీహార్ సీఎం కాగా, ఆర్సీపీ సింగ్ ఆయనకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆపై రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జేడీయూ తరఫున రాజ్యసభకు వెళ్లారు. నితీశ్ నమ్మకం చూరగొన్న ఆయనకు అప్పట్లోనే జేడీయూ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు.