తన మాటలతో వైఎస్ జగన్ రైతులను నట్టేటముంచారు: దేవినేని ఉమ
- ఏపీలో దుర్భరంగా మారిన రైతుల పరిస్థితి
- మొన్న కిలో టమాటా రూ.1
- నేడు కేజీ అరటి 2 రూపాయలు
- ధరల స్థిరీకరణ నిధి, మద్దతు ధర మాటలతో మభ్యపెట్టారు
ఆంధ్రప్రదేశ్‌లో మద్దతు ధర రాక రైతులు పడుతున్న ఇబ్బందులను గురించి న్యూస్ ఛానెల్‌లో వచ్చిన ఓ వార్తను పోస్ట్ చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా అరటి ధరలు ఊహించని రీతిలో పడిపోయాయని చెప్పారు.
‘ఏపీలో దుర్భరంగా మారిన రైతుల పరిస్థితి.. మొన్న కిలో టమాటా రూ.1, నేడు కేజీ అరటి 2 రూపాయలు.. కొనే నాథుడు లేక టమాటాను రైతు నాడు రోడ్డుపై వాటిని పారబోస్తే, నేడు అరటిని రైతు జీవాలకు వదిలేశాడు. ధాన్యం కొనుగోలు చేయరు, ఇవ్వాల్సిన 1,307 కోట్ల రూపాయలు ఇవ్వరు. ధరల స్థిరీకరణ నిధి, మద్దతు ధర మాటలతో వైఎస్ జగన్ రైతులను నట్టేట ముంచారు’ అని దేవినేని ఉమ విమర్శించారు.