భారత్-ఆసీస్ రెండో టెస్టు: అద్భుతంగా రాణిస్తోన్న అజింక్యా రహానె
- మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో రెండో టెస్టు
- ఆతిథ్య జట్టు నిన్న 195 పరుగులకే ఆలౌట్
- ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 256/5
- క్రీజులో అజింక్యా రహానె 89, రవీంద్ర జడేజా 35
ఆస్ట్రేలియా-భారత్ మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్యా రహానె అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత బౌలర్ల ధాటికి ఆతిథ్య జట్టు నిన్న 195 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. నేడు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది.
మయాంక్ అగర్వాల్ 0, శుభ్‌మాన్ గిల్ 45, చటేశ్వర్ పుజారా 17 పరుగులకు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన అజింక్యా రహానె అద్భుతంగా రాణిస్తూ సెంచరీకి చేరువయ్యాడు. హనుమ విహారి 21, రిషబ్ పంత్ 29 పరుగులు చేసి ఓటయ్యారు.
ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానె 89, రవీంద్ర జడేజా 35 పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు తీశారు. లైయన్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 256/5 గా ఉంది.