మోదీ నాయకత్వాన్ని మమత తప్ప ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది: టీఎంసీ మాజీ నేత సువేందు

  • పాకిస్థాన్, బలూచిస్థాన్ ప్రజలు కూడా మోదీని ప్రశంసిస్తున్నారు
  • బీజేపీ నాయకులను ఔట్‌సైడర్స్ అనడం తగదు
  • మమత అల్లుడు రూ. 25 లక్షల విలువైన కళ్లద్దాలు ధరిస్తారు
  • టీఎంసీ నాయకుల్లో క్రమశిక్షణ లేదు: సువేందు
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రపంచం మొత్తం గుర్తిస్తోందని, ఒక్క మమతా బెనర్జీ మాత్రం అంగీకరించలేకపోతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ అన్నారు. పాకిస్థాన్, బలూచిస్థాన్ ప్రజలు కూడా మోదీని గౌరవిస్తున్నారని అన్నారు. కానీ దీదీ (మమత) మాత్రం బీజేపీ నాయకులను ఔట్‌సైడర్స్ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఎంసీ పాలన నియంతృత్వాన్ని తలపిస్తోందన్నారు. మమత మాత్రం తెల్లచీర కట్టుకుని, స్లిప్పర్స్ ధరించి సాధారణ వ్యక్తిలా కనిపిస్తారని, కానీ ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీ మాత్రం రూ. 25 లక్షల విలువైన కళ్లద్దాలు ధరిస్తూ,  ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఇంట్లో విలాస జీవితం గడుపుతున్నారని విమర్శించారు.

టీఎంసీ నుంచి బయటకు వచ్చిన తాము క్రమశిక్షణ గల సైనికులమని, కానీ టీఎంసీ నాయకుల్లో క్రమశిక్షణ లేదని ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి అన్నారు.   వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాష్ట్రం సోనార్ బెంగాల్ (బంగారు బెంగాల్) అవుతుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ దేశ సేవకు అంకితమై పనిచేస్తోందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల రైతులు పీఎం కిసాన్ నగదు ప్రయోజనాన్ని పొందుతుండగా, ఇక్కడి రైతులకు మాత్రం మమత దానిని దూరం చేశారని సువేందు అధికారి దుయ్యబట్టారు.


More Telugu News