సీరం, భారత్ బయోటెక్ టీకాల కోసం ప్రపంచం చూపు: కిషన్‌రెడ్డి
- కరోనా టీకాకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు
- టీకా ఎంపిక కోసం టాస్క్‌ఫోర్స్
- పరీక్షల దశలో ఉన్న టీకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి
ఫైజర్, స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రపంచం మాత్రం సీరం, భారత్ బయోటెక్ టీకాల కోసం ఎదురుచూస్తోందని కేంద్ర హోం శాఖ సహయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పరీక్షల దశలో ఉన్న ఈ రెండు టీకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కరోనా టీకాకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. సరైన టీకా ఎంపిక కోసం కేంద్రం టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లోని ల్యాబ్‌క్యూబ్‌లో ఇమ్యూనో బూస్టర్ ఉత్పత్తిని కిషన్‌రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.