ఢిల్లీలో రైతుల పోరుకు మద్దతు.. రూ. 10 లక్షలు అందించిన వడ్డే శోభనాద్రీశ్వరరావు
- మోదీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
- పచ్చి అబద్ధాలు చెబుతున్నారు
- ఎముకలు కొరికే చలిలో ఉద్యమం చేస్తున్నా మోదీకి పట్టడం లేదు
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల రైతులతో మోదీ మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకే కొత్త చట్టాలను తెచ్చినట్టు చెబుతున్న ప్రధాని మాటలు పూర్తిగా అవాస్తవమన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు నెల రోజులుగా ఎముకలు కొరికే చలిలో ఉద్యమిస్తున్నా మోదీకి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై ఇసుమంతైనా జాలి, దయ చూపకపోవడం దారుణమని శోభనాద్రీశ్వరరావు విచారం వ్యక్తం చేశారు.