ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తారా?: పూతలపట్టు ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • కోర్టులు, న్యాయమూర్తులపై కొనసాగుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు
  • వీళ్లసలు న్యాయమూర్తులేనా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే
  • న్యాయమూర్తి పదవికి మోసం చేస్తున్నారని ఆగ్రహం
న్యాయస్థానాలపైనా, న్యాయమూర్తులపైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ నేతలు కొందరు న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, కార్యకర్తలు సోషల్ మీడియాలో కోర్టులు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణించడంతో సీబీఐ రంగంలోకి దిగి పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే తాజాగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

 న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతున్నారని, ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అసలు వీళ్లు న్యాయమూర్తులేనా? అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేద కుటుంబంలో మీరు పుట్టలేదా, పేదల కష్టాలు మీకు తెలియవా? అని ప్రశ్నించారు. కోర్టులలో చంద్రబాబు చెప్పినదే కీలకంగా మారుతోందని, అలాంటప్పుడు న్యాయమూర్తి పదవికి మీరు మోసం చేసినట్టు కాదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.


More Telugu News