ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ
- వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీయే నుంచి నిష్క్రమణ
- ప్రకటించిన ఆర్ఎల్పీ అధినేత హనుమాన్ బేణీవాల్
- తాము రైతుల పక్షమని స్పష్టీకరణ
- ఇప్పటికే ఎన్డీయే నుంచి తప్పుకున్న శివసేన, అకాలీదళ్
జాతీయ స్థాయిలో మరోపార్టీ ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంది. కొంతకాలం కిందటే శివసేన ఎన్డీయేకి దూరం కాగా, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ సైతం దూరం జరిగింది. తాజాగా రాజస్థాన్ కు చెందిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) కూడా ఎన్డీయే నుంచి నిష్క్రమించింది. ఈ నిర్ణయంపై ఆర్ఎల్పీ అధినేత హనుమాన్ బేణీవాల్ వివరణ ఇచ్చారు.
తాము రైతుల పక్షమేనని స్పష్టం చేశారు. జాతీయ వ్యవసాయ చట్టాలను తాము వ్యతిరేకిస్తున్నామని, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి తమ మద్దతు ఉండబోదని వెల్లడించారు. ఇవాళ రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో రైతుల నిరసన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ఆర్ఎల్పీకి లోక్ సభలో ఉన్నదే ఒక ఎంపీ. ఆ ఎంపీ ఎవరో కాదు పార్టీ అధినేత హనుమాన్ బేణీవాలే. అటు, రాజస్థాన్ అసెంబ్లీలో ఆర్ఎల్పీ బలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. నాగ్ పూర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ మద్దతుతో బరిలో దిగిన బేణీవాల్ విజయం సాధించారు.