ఏపీలో రంగా తర్వాత ఆ స్థాయి కాపు నేత పవన్ కల్యాణ్: వీహెచ్

  • ఏపీలో రంగా తర్వాత అంతటి వేవ్ ఉన్న నాయకుడు పవన్ 
  • ఆంధ్రలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలి
  • రంగా సీఎం అవుతాడనే హత్య చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి పవన్ వస్తే.. పీసీసీ పదవిని ఇప్పిస్తానని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా దొండపాడులో ఈరోజు వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంగా సీఎం అవుతాడనే అనుమానాలతోనే ఆయనను హత్య చేశారని చెప్పారు. తాను టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అడిగినందుకు... తనకు ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. తనకు ప్రాణం కంటే పార్టీనే ముఖ్యమని చెప్పారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతానని అన్నారు.

టీపీసీసీ చీఫ్ పదవి కోసం కొందరు నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని వీహెచ్ అన్నారు. ఏపీ రాజకీయాలపై వీహెచ్ మాట్లాడుతూ, ఆంధ్రలో 27 శాతం జనాభా ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు. కాపు నేతల్లో వంగవీటి రంగా తర్వాత అంతటి వేవ్ కాపు నేతల్లో పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉందని చెప్పారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఏమేరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.


More Telugu News