బేగంపేటలోని చిన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లిన సోనూసూద్.. వీడియో ఇదిగో
- చైనా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు కరోనా కాలంలో నష్టం
- పేరు మార్చి సోనూసూద్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ అని పెట్టిన యజమాని
- అక్కడకు వెళ్లి వంట చేసిన సోనూసూద్
- మురిసిపోయిన స్థానికులు
కరోనా విజృంభణ సమయంలో పేదలను ఆదుకుని గొప్ప మనసును చాటుకున్న సినీనటుడు సోనూసూద్‌కు పలు ప్రాంతాల్లో విగ్రహాలు పెడుతున్న విషయం తెలిసిందే. తమ దుకాణాలకు కూడా కొందరు సోనూసూద్ పేర్లు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ వ్యక్తి ‘సోనూసూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్’ పేరిట ఫాస్ట్ ఫుడ్ కేంద్రాన్ని పెట్టుకున్నాడు. విషయం తెలిసిన సోనూసూద్ అక్కడికి వెళ్లారు.
దీంతో ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ఓనర్‌తో పాటు అక్కడున్న వారంతా సోనూసూద్‌ను చూసి మురిసిపోయారు. గతంలో ఆ సెంటర్‌కు ‘చైనా ఫుడ్‌సెంటర్’ అని పేరు ఉండేది. చైనా అన్న పేరు ఉండడంతో కరోనా నేపథ్యంలో ఆయన ఆదాయం పడిపోయింది. దీంతో అదే సమయంలో పేదలకు సాయం చేస్తోన్న సోనూసూద్ పేరు కలసి వచ్చేలా తన సెంటర్ పేరును మార్చుకున్నాడు. దీంతో ఆయనకు మళ్లీ గిరాకీ పెరిగి, వ్యాపారం కళకళలాడుతోంది. సామాజిక మధ్యమాల ద్వారా ఈ విషయాన్ని సోనూసూద్ తెలుసుకుని అక్కడకు వెళ్లి, వారిని సర్ ప్రైజ్ చేశారు.