తొందరపాటు వద్దు: మాణికం ఠాగూర్ కు జగ్గారెడ్డి లేఖ
- కాంగ్రెస్ లో టెన్షన్ పెంచుతున్న పీసీసీ చీఫ్ నియామకం
- రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న రేవంత్ రెడ్డి పేరు
- సీనియర్ల సలహాలు తీసుకోవాలన్న జగ్గారెడ్డి
టీపీసీసీ చీఫ్ నియామకం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ పెంచుతోంది. ఈ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వబోతున్నారనే ప్రచారంతో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. రేవంత్ కు పదవి ఇస్తే తాను కాంగ్రెస్ నుంచి బయటకు వస్తానని సీనియర్ నాయకుడు వీహెచ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజాగా జగ్గారెడ్డి తన అసహనాన్ని ప్రదర్శించారు. పీసీసీ చీఫ్ పదవిపై తొందరపాటుగా నిర్ణయం తీసుకోవద్దని ఆయన కోరారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ కు లేఖ రాశారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డినే చీఫ్ గా కొనసాగించాలని జగ్గారెడ్డి కోరారు. ఈ పదవికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు సీనియర్ల నుంచి సూచనలను తీసుకోవాలని చెప్పారు. సీనియర్ల ఏకాభిప్రాయంతోనే పీసీసీ చీఫ్ ఎన్నిక జరగాలని అన్నారు.