మిమ్మల్ని 10 అడుగుల లోతులో పాతిపెడతా: అక్రమార్కులకు మధ్యప్రదేశ్ సీఎం హెచ్చరిక
- నేను ఈమధ్య చాలా ప్రమాదకర మూడ్‌లో ఉన్నాను
- అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని వదలను
- మధ్యప్రదేశ్‌ను వదిలి వెళ్లిపోండి
- మీరు ఏమైపోయారన్నదీ ఎవరికీ తెలియకుండా చేస్తా
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హౌషంగాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అక్రమార్కులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘నేను ఈ రోజుల్లో చాలా ప్రమాదకర మూడ్‌లో ఉన్నాను. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని వదలను. మధ్యప్రదేశ్‌ను వదిలి వెళ్లిపోండి. లేదంటే మిమ్మల్ని భూమిలో 10 అడుగుల లోతులో పాతిపెడతాను. మీరు ఏమైపోయారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు’ అని చౌహాన్ వ్యాఖ్యలు చేశారు.
తమ ప్రభుత్వం మెరుగైన పాలనను అందిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సరైన సమయంలో, ఎటువంటి లంచాలు ఇవ్వకుండా పొందుతున్నారని ఆయన చెప్పారు. కాగా, ఖజ్రానా, కబుతార్ ఖానా ప్రాంతాల్లో ఇటీవల ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ దురాక్రమణలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేసింది.