రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే చంపేస్తాం: వీహెచ్ కు బెదిరింపు కాల్
- రేవంత్ కు పీసీసీ ఇస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తానన్న వీహెచ్
- రేవంత్ తెలంగాణ వ్యతిరేకి అని విమర్శ
- చంపేస్తామంటూ ఫోన్ చేసి బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి
చంపేస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు బెదిరింపు కాల్ వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారు. వీహెచ్ ను అసభ్య పదజాలంతో దూషించారు. తనకు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, సైబరాబాద్ పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు చేశారు. తనను బెదిరించిన వ్యక్తిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
మరోవైపు పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీహెచ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటానని అన్నారు. తనతో పాటు పలువురు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పార్టీని వీడుతారని చెప్పారు. పార్టీకి ఎంతో సేవ చేసిన కోమటిరెడ్డి, జగ్గారెడ్డిలు పీసీసీ చీఫ్ పదవికి పనికిరారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని... అలాంటి వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవిని ఎలా ఇస్తారని నిలదీశారు.