మంత్రి మల్లారెడ్డి కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ పై ఐదేళ్ల నిషేధం!

  • 2018 విద్యా సంవత్సరంలో బీ++ గ్రేడ్ కేటాయించిన న్యాక్
  • గ్రేస్ పెంచుకోవడానికి తప్పుడు డాక్యుమెంట్లు పంపిన కాలేజీ యాజమాన్యం
  • అక్రిడేషన్ పై ఐదేళ్ల నిషేధం విధించిన న్యాక్
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) షాకిచ్చింది. హైదరాబాదులోని కొంపల్లిలో ఉన్న  మల్లారెడ్డి కాలేజ్ అఫ్  ఇంజినీరింగ్  పై ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన అధికారిక వెబ్ సైట్లో ప్రకటించింది.

వివరాల్లోకి వెళ్తే,  మల్లారెడ్డి కాలేజ్ అఫ్  ఇంజినీరింగ్  కి 2018 విద్యా సంవత్సరంలో న్యాక్ బీ++ గ్రేడ్ ను కేటాయించింది. అయితే, ఈ గ్రేడ్ ను అధిగమించి మంచి గ్రేస్ సాధించాలనే ఉద్దేశంతో కాలేజీ మోసం చేసినట్టు అధికారులు గుర్తించారు. న్యాక్ బెంగళూరుకు నకిలీ డాక్యుమెంట్లను పంపారు. ఈ విషయాన్ని పసిగట్టిన న్యాక్ కౌన్సిల్ అధికారులు  కాలేజ్ యాజమాన్యం మోసానికి పాల్పడిందని చర్యలు చేపట్టారు. అక్రిడేషన్ విషయంలో ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇదే విషయాన్ని తన వెబ్ సైట్ లో న్యాక్ పొందుపరిచింది. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.  


More Telugu News