దిల్ రాజు బ్యానర్లో మరోసారి సిద్ధార్థ్!

దిల్ రాజు బ్యానర్లో మరోసారి సిద్ధార్థ్!
  • గత కొన్నేళ్లుగా వెనుకపడిన సిద్ధార్థ్ 
  • తాజాగా 'మహా సముద్రంలో' హీరో 
  • సినిమా కోసం సంప్రదించిన విరించి వర్మ  
ఒకప్పుడు సిద్ధార్థ్ అంటే అమ్మాయిల్లో ఎంతో ఫాలోయింగ్ వుండేది. వరుసగా ప్రేమకథా చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. సూపర్ హిట్టయిన 'బొమ్మరిల్లు' సినిమాతో అయితే, చెప్పేక్కర్లేదు. అలాంటి సిద్ధార్థ్ ఆ తర్వాత వరుస పరాజయాలతో గత కొన్నేళ్లుగా వెనుకపడిపోయాడు. ఇటీవలే మళ్లీ తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహా సముద్రం' అనే సినిమాలో ఒక హీరోగా నటిస్తున్నాడు.

ఈ క్రమంలో సిద్ధూకి తెలుగు నుంచి మరో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాల దర్శకుడు విరించివర్మ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రం కోసం సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం. పైగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చారట. గతంలో సిద్ధూ నటించిన 'బొమ్మరిల్లు' నిర్మించింది దిల్ రాజే అన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.


More Telugu News