సైబరాబాద్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం.. ఉల్లంఘిస్తే చర్యలు: పోలీస్ కమీషనర్ ప్రకటన

  • కరోనా విజృంభణతో నిర్ణయం
  • పబ్‌లు, బార్లపై నిఘా
  • విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా వేడుకలపై నిషేధం
సైబరాబాద్ పరిధిలో నూతన సంవత్సరం వేడుకలు అర్ధరాత్రి పూట ఎంతగా ఘనంగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే, ఈ సారి ప్రజలకు బార్లు, పబ్‌లు, ఇతర వేదికలపై నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే అవకాశం లేదు. కరోనా వ్యాప్తి ఇంకా తగ్గని నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో, నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని సైబరాబాబ్ సీపీ సజ్జనార్ ప్రకటన చేశారు.

 పబ్‌లు, బార్లపై నిఘా ఏర్పాటు చేశామని, అలాగే, నగరంలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలావుంచితే, ఆన్ లైన్ లోన్ యాప్స్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఆత్మహత్యలు చేసుకునేందుకు దారి తీస్తున్న నేపథ్యంలో యాప్స్ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ ఈ రోజు మీడియాకు తెలిపారు. నిన్న కూడా నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇందులో కీలక పాత్ర పోషించిన చైనా వ్యక్తి పరారీలో ఉన్నారని తెలియజేశారు.

యాప్స్  ద్వారా  తక్కువ రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా లోన్స్ ఇస్తూ, అవి చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యమైనా వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఇక్కడి స్థానికులతో కలిసి చైనా వాసి రెండు డిజిటల్ కంపెనీలకు ఏర్పాటు చేశారని తెలిపారు. మొత్తం 11 యాప్‌లు సృష్టించి రుణాలు ఇచ్చారని చెప్పారు.


More Telugu News