క్రిస్మస్ వేడుకల్లో హుషారుగా పాల్గొన్న టాలీవుడ్ హీరోలు.. ఫొటోలు వైరల్
- ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు
- చిరంజీవి కొత్త లుక్ వైరల్
- తన పిల్లల ఫొటో పోస్ట్ చేసిన మహేశ్
ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు భక్తిప్రపత్తులతో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. టాలీవుడ్ అగ్రనటులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. యంగ్ లుక్‌లో ఆయన కనపడుతున్నారు. అందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
తమ ఇంట్లో జరుపుకుంటోన్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫొటోను సూపర్ స్టార్ మహేశ్ బాబు పోస్ట్ చేశాడు. తన పిల్లలు క్రిస్మస్ ట్రీ వద్ద దిగిన ఫొటోను ఆయన పోస్ట్ చేశాడు. అందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ శాంతి, ప్రేమ, సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపాడు. ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. మరికొందరు టాలీవుడ్ హీరోలు కూడా ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.