మిస్టిక్ థ్రిల్లర్ మూవీలో సాయితేజ్... నేడు కొత్త చిత్రం ప్రారంభం

  • జోరుమీదున్న సాయితేజ్
  • కార్తీక్ దండు దర్శకత్వంలో కొత్త సినిమా
  • హైదరాబాదులో పూజా కార్యక్రమాలు
  • క్లాప్ కొట్టిన సాయితేజ్
  • స్క్రీన్ ప్లే అందిస్తున్న సుకుమార్
మెగా హీరో సాయితేజ్ మాంచి ఊపుమీదున్నాడు. తన తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం రేపు రిలీజ్ అవుతుండగా, ఇవాళ మరో కొత్తం చిత్రం షురూ చేశాడు. నూతన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టిక్ థ్రిల్లర్ మూవీలో సాయితేజ్ హీరోగా నటిస్తున్నాడు.

ఇవాళ హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగ్గా, సాయితేజ్ దేవుడి పటాలపై క్లాప్ కొట్టాడు. సాయితేజ్ కెరీర్ లో ఇది 15వ చిత్రం. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎస్వీసీసీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News