రేపు యథాతథంగా ఇళ్ల పట్టాల పంపిణీ... నిలిపివేసేలా స్టే ఇవ్వలేమన్న హైకోర్టు

  • పంపిణీపై కోర్టును ఆశ్రయించిన ప్రసాద్ బాబు
  • ఒక వర్గం వారికి వేరే నియోజకవర్గంలో స్థలాలు కేటాయించారని వెల్లడి
  • సమస్యలు వస్తాయని కోర్టుకు విన్నపం
  • పిటిషనర్ అభ్యంతరాలు తోసిపుచ్చిన న్యాయస్థానం
ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అడ్డంకులు తొలగిపోయాయి. పంపిణీ నిలిపివేసేలా స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో రేపు డిసెంబరు 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టనున్నారు.

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఓ వర్గం వారికి వేరే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రసాద్ బాబు అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని, పంపిణీపై స్టే ఇవ్వాలని కోర్టును కోరాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.


More Telugu News