ఏపీ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో కొత్తగా 357 పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 59,551 కరోనా టెస్టులు
- నలుగురి మృతి
- 355 మందికి కరోనా నయం
- యాక్టివ్ కేసుల సంఖ్య 3,862
ఏపీలో గడచిన 24 గంటల్లో 59,551 కరోనా పరీక్షలు నిర్వహించగా 357 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 355 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,075కి పెరిగింది. 8,69,124 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,862కి తగ్గింది. మొత్తం మృతుల సంఖ్య 7,089కి చేరింది.
కాగా, రాజమండ్రిలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేగగా, దానిపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఆళ్ల నాని వివరణ ఇచ్చారు. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు సోకింది కొత్తరకం కరోనా వైరస్సా, కాదా అనేది నిర్ధారణ కావాల్సి ఉందని వెల్లడించారు. ఆమెతో పాటు, ఆమె కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్ కు తరలించామని చెప్పారు. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సర్కారు అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.