కేసీఆర్ కు దమ్ముంటే పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛ ఇచ్చి చూడాలి: బండి సంజయ్

  • శాంతిభద్రతలపై సీఎం చేతులెత్తేశాడన్న బండి సంజయ్
  • పోలీసులే ప్రభుత్వ పాత్ర పోషిస్తున్నారని వెల్లడి
  • అక్రమ నివాసులను జల్లెడపట్టగలరా అంటూ సవాల్
  • పోలీసు వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ చేతులెత్తేశాడని, ప్రభుత్వం పోషించాల్సిన పాత్రను కొంతమంది పోలీసు అధికారులు పోషిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. అయితే, పోలీసు వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం కాదని, తెలంగాణ పోలీసులు హీరోలని అభివర్ణించారు.

"ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే, తెలంగాణ పౌరుషం ఉంటే, దేశభక్తి ఉంటే, నిజమైన భారతీయుడే అయితే రాష్ట్ర పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛ ఇచ్చి చూడాలి. నిజాయతీగా పనిచేసే ఐపీఎస్ అధికారులు సంఘవిద్రోహశక్తుల ఆటకట్టించి మీ ముందు నిలబెడతారు. ఆ దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? రోహింగ్యాలు, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అక్రమంగా వచ్చేవారిని జల్లెడపట్టగలరా?" అని సవాల్ విసిరారు.


More Telugu News