అత్యంత కిరాతకంగా స్నేహలతని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలి : నారా లోకేశ్
- వైఎస్ జగన్ గారి నిర్లక్ష్య ధోరణి
- అనంతపురంలో దళిత బిడ్డ స్నేహలత బలైపోయింది
- కూతుర్ని, కుటుంబాన్ని టార్చర్ చేస్తున్నారని తల్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు
- ఇళ్లు మారమని సలహా ఇచ్చింది వైకాపా ప్రభుత్వం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్య ధోరణి కారణంగా అనంతపురంలో బంగారు భవిష్యత్తు ఉన్న దళిత బిడ్డ స్నేహలత బలైపోయిందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. స్నేహలత మృతి పట్ల ఆయన స్పందిస్తూ.. ‘రక్షించాలని వేడుకుంటూ ఏడ్చి, ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి అని ఒక తల్లి విలపిస్తుంది. ప్రేమ పేరుతో కూతుర్ని, కుటుంబాన్ని టార్చర్ చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేస్తే ఇళ్ళు మారమని సలహా ఇచ్చింది వైకాపా ప్రభుత్వం’ అని లోకేశ్ ట్వీట్లు చేశారు.
‘కూతురు కనపడటం లేదంటూ ఫోన్ చేస్తే ఉదయం చూద్దాం అంటూ పోలీసుల సమాధానం, దిశ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే నీది ఏ రాష్ట్రం అని ప్రశ్నించి, లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్కోమని ఉచిత సలహా వచ్చింది. కాపాడుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ అసమర్థత కారణంగా చదువులోనూ, స్పోర్ట్స్ లోనూ రాణించిన స్నేహాలత ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అత్యంత కిరాతకంగా స్నేహలతని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. స్నేహలత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.