ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్ఐఏకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

  • సిక్కు ఉగ్రవాదాన్ని పునరుద్ధించే ప్రయత్నం
  • నిషేధిత ఉగ్రవాద సంస్థల్లోకి యువతను ఆకర్షిస్తున్నట్టు ఆరోపణలు
  • సైప్రస్‌లో తలదాచుకున్న నిందితుడు
  • దేశ బహిష్కరణతో స్వదేశానికి
ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్జీత్ సింగ్‌ నిజ్జర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసింది. అమృత్‌సర్‌కు చెందిన గుర్జీత్ సింగ్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఖలిస్థాన్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో హర్పాల్ సింగ్, మెయిన్‌ఖాన్‌లతో కలిసి సిక్కు ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు గుర్జీత్ నేరపూరిత చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

1984 ఆపరేషన్ బ్లూస్టార్, ఖలిస్థాన్ అనుకూల పోస్టులు చేసేవాడు. అంతేకాక, నిషేధిత ఉగ్రవాద సంస్థల్లోకి యువతను ఆకర్షించినట్టు ఎన్ఐఏ ఆరోపిస్తోంది. గుర్జీత్ సింగ్ 2017లో సైప్రస్ వెళ్లి తలదాచుకున్నాడు. అయితే, ఈ కేసులో అక్కడ అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో ఆ దేశం గుర్జీత్‌ను దేశం నుంచి బహిష్కరించింది. దీంతో అతడు ఢిల్లీ రాగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. తదుపరి దర్యాప్తు కోసం అధికారులు అతడిని ముంబై తరలించనున్నారు.


More Telugu News