కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- వచ్చే ఏడాది మార్చిలోపు అవుతారు
- ఇటీవల కేటీఆర్‌ను కలిశాను
- పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాను
తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చిలోపు రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పారు.
డోర్నకల్‌లో మునిసిపాలిటీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇటీవల తాను కేటీఆర్‌ను కలిశానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించానని అన్నారు.
డోర్నకల్‌కు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంజూరు చేయాలని కోరినట్లు వ్యాఖ్యానించారు. కురవి మండలంలోని సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని కోరానని చెప్పారు. అలాగే, నర్సింహుల పేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెలకొల్పాలని చెప్పినట్లు తెలిపారు.