తెలుగు భాషపై ఆ రాష్ట్రాలకు ఉన్నపాటి గౌరవం కూడా జగన్‌కు లేదు: సోమిరెడ్డి

  • తెలుగును అధికారిక భాషల్లో చేర్చిన పశ్చిమ బెంగాల్
  • మాతృభాషలో నేర్చుకునే విద్యకు పరిపూర్ణత
  • తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని సూచన
పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తెలుగును అధికార భాషగా గుర్తించడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. ఆమె నిర్ణయాన్ని కొనియాడిన ఆయన ఏపీ సీఎం జగన్‌పై మండిపడ్డారు. పొరుగున ఉన్న తమిళనాడు, ఎక్కడో ఉన్న బెంగాల్‌లో తెలుగుకు గౌరవం లభిస్తోందని, కానీ సొంత రాష్ట్రంలో తెలుగుకు గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మాతృభాషలో మాట్లాడడం ప్రజల హక్కు అని అన్నారు. మాతృభాషలో విద్య నేర్చుకుంటేనే పరిపూర్ణత వస్తుందన్నారు. మమతా బెనర్జీని చూసైనా జగన్ కళ్లు తెరవాలన్నారు. ఉద్యోగం, ఉపాధి కోసం ఇంగ్లిష్, హిందీ భాషలు అవసరమే అయినా, ఆ కారణంగా మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదని సోమిరెడ్డి హితవు పలికారు.


More Telugu News