ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్... ఘనస్వాగతం పలికిన మంత్రులు
- కడప జిల్లాలో సీఎం జగన్ మూడ్రోజుల పర్యటన
- విమానంలో కడప విమానాశ్రయానికి చేరిక
- అక్కడ్నించి హెలికాప్టర్ లో ఇడుపులపాయ పయనం
- స్వాగతం పలికిన అంజాద్ బాషా, ఆదిమూలపు తదితరులు
- ఇడుపులపాయలో బస చేయనున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులతో సహా నేటి సాయంత్రం కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయ వెళ్లారు. సీఎం జగన్ కు వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి గౌరవించారు. సీఎం జగన్ కు స్వీయ చిత్రపటాన్ని బహూకరించారు.
కాగా, సీఎం జగన్ క్రిస్మస్ వేడుకలను కడప జిల్లా ఇడుపులపాయలో జరుపుకుంటారని తెలుస్తోంది. తన పర్యటనలో భాగంగా ఆయన ఇడుపులపాయలో బస చేయనున్నారు. సీఎంకు స్వాగతం పలికిన వారిలో అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. తన మూడ్రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.