ఏపీలో పారా మెడికల్ కోర్సుల ఫీజు ఖరారు!

  • ఫీజులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుకు కన్వీనర్ కోటా ఫీజు రూ. 83 వేలు
  • బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కన్వీనర్ కోటా ఫీజు రూ. 18 వేలు
ఏపీలో నర్సింగ్, ఆయుష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. అన్ ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 2022-23 వరకు ఈ ఫీజులు వర్తిస్తాయి.

ఫీజుల వివరాలు ఇవే:

ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 83 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 1.49 లక్షలు

బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 18 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 80 వేలు

పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 18 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 80 వేలు

బీహెచ్ఎంఎస్ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 22 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 3 లక్షలు

బీపీటీ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 18 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 80 వేలు

ఎంపీటీ కోర్సుకు:
కన్వీనర్ కోటా: రూ. 94 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 1.60 లక్షలు

జీఎన్ఎం కోర్సులు:
కన్వీనర్ కోటా: రూ. 15,500
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 72 వేలు

డీఎంఎల్టీ, పారామెడికల్ డిప్లమో కోర్సులు:
కన్వీనర్ కోటా: రూ. 14 వేలు
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 45 వేలు.


More Telugu News