అమెరికా రాజకీయనేతలపై చైనా వలపు వల!
- వెల్లడైన చైనా పన్నాగాలు
- కీలక సమాచారం కోసం అమెరికాలో గూఢచారుల నియామకం
- వర్సిటీ విద్యార్థినిగా పరిచయం చేసుకున్న ఫాంగ్
- విస్తృతస్థాయిలో పరిచయాలతో కలకలం
- అనేకమంది నేతలతో ఫాంగ్ సన్నిహిత సంబంధాలు
చైనా కుయుక్తులు ఎలాంటివో అమెరికా నిఘా వర్గాలు బట్టబయలు చేశాయి. నిఘా వర్గాల ప్రకారం.... అమెరికాలోని అనేక మంది అగ్ర రాజకీయనేతలపై చైనా వలపు వల విసిరినట్టు తేలింది. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్న ఓ యువతి పలువురు మేయర్లతో సహా, రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకుని, అమెరికా ప్రభుత్వానికి సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నించింది. ఇదంతా 2011 నుంచి 2015 మధ్యన జరిగింది.
ఈ గూఢచారిణి ఫాంగ్ ఫాంగ్ లేక క్రిస్టీన్ ఫాంగ్ అని గుర్తించారు. ఇదంతా ఆమె చైనా స్టేట్ సెక్యూరిటీ (ఎంఎస్ఎస్) కోసం చేసిందని అనుమానిస్తున్నారు. నిధుల సేకరణ కార్యక్రమాలు, విస్తృతస్థాయిలో పరిచయాలు, వ్యక్తిగత ఆకర్షణ, శృంగార సంబంధాలు... ఇలా ఏది వీలైతే అది ఎరవేసి రాజకీయ నేతలను బుట్టలో వేసేందుకు ఫాంగ్ ప్రయత్నించిందని, కనీసం ఇద్దరు మేయర్లతో ఆమె లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నట్టు వెల్లడైంది.
ఫాంగ్ 2011లో బే ఏరియా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిగా అడుగుపెట్టి ఇదంతా చేసినట్టు తెలుసుకున్నారు. ఆమె వరుసగా ఉన్నతశ్రేణి రాజకీయనేతలతో పరిచయాలు పెంచుకుంటూ పోతున్నా, తన వ్యక్తిగత విషయాలను మాత్రం ఎవరికీ తెలియనివ్వలేదు. అయితే, ఎంతో సంపన్నురాలిగా కనిపించేలా ఎప్పుడూ ఓ తెల్లని మెర్సిడెస్ బెంజ్ కారులో తిరుగుతుండేది. ఆమెపై అనుమానంతో అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు పలువురు నేతలను అప్రమత్తం చేశారు.
ఈ క్రమంలో ఫాంగ్ 2015లో అదృశ్యమైంది. వాషింగ్టన్ డీసీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉండగా, ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఉన్నపళాన చైనా వెళ్లిపోయింది. అమెరికా ప్రభుత్వం నుంచి చైనా వ్యవహారాలకు సంంధించిన సమాచారాన్ని సేకరించడమే ఆమెకు అప్పగించిన పని అని అగ్రరాజ్య నిఘా వర్గాలు నిర్ధారించుకున్నాయి.
అమెరికా మంత్రి మైక్ పాంపియో ఈ విషయాన్ని నేరుగా ఎత్తిచూపకపోయినా, స్టూడెంట్ల ముసుగులో చైనా వ్యక్తులు అమెరికాలో కాలేజీల్లో చేరి కీలక సమాచారాన్ని దొంగిలిస్తున్నారని వ్యాఖ్యానించారు. చైనా భద్రతా సంస్థలు విద్యార్థులను గూఢచారులుగా నియమించుకుంటున్నాయని ఆరోపించారు.