రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు వేయనున్న కేంద్ర ప్రభుత్వం!

  • 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డిసెంబర్ 25న డబ్బు జమ
  • కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరుకానున్న మోదీ
  • ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు లబ్ధి
ఓ వైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయనున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర తోమర్ ప్రకటించారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డిసెంబర్ 25న రూ.18 వేల కోట్లను జమ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని చెప్పారు. ఆన్ లైన్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 2 కోట్ల మంది రైతులు రిజిస్టర్ చేయించుకున్నారని తెలిపారు.

మరోవైపు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్ ఇండియా ఎన్జీవో కాన్ఫెడరేషన్ ప్రతినిధులతో తోమర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా లక్ష గ్రామాలకు చెందిన 3,13,363 మంది రైతులు చేసిన సంతకాలతో కూడిన డబ్బాలను ఎన్జీవో ప్రతినిధులు తోమర్ కు అందించారు.


More Telugu News