అమ్మకాల్లో దుమ్మురేపుతున్న 'షైన్' బైకులు!
- 2006లో భారత మార్కెట్లోకి వచ్చిన హోండా షైన్
- ఇప్పటివరకు 90 లక్షల బైకుల అమ్మకం
- తొలి రెండేళ్లలోనే బెస్ట్ సెల్లింగ్ బైక్ గా గుర్తింపు
- 54 నెలల కాలంలో 10 లక్షల కస్టమర్లు
- 125 సీసీ విభాగంలో తనదైన ముద్ర
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా ఉత్పత్తి చేస్తున్న షైన్ మోటార్ సైకిల్ అమ్మకాల పరంగా దూసుకుపోతోందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2006లో షైన్ మోడల్ ను మార్కెట్లో ప్రవేశపెట్టాక ఇప్పటివరకు 90 లక్షల బైకులు విక్రయించామని హోండా ప్రతినిధులు వెల్లడించారు. 2020లో ఆటోమొబైల్ రంగం గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ 125 సీసీ సెగ్మెంట్లో షైన్ అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు.
14 ఏళ్ల కిందట షైన్ భారత రోడ్లపై పరుగులు తీయడం మొదలుపెట్టిందని, కేవలం 54 నెలల కాలంలోనే 10 లక్షల కస్టమర్లను సొంతం చేసుకుందని వివరించారు. భారత విపణిలో ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ గా నిలిచిందని గర్వంగా చెప్పారు. 2018 నాటికి దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు 125 సీసీ బైకుల్లో ఒకటి షైన్ అని వెల్లడించారు.
ఇక, బీఎస్-6 ప్రమాణాలతో నిర్మితమైన తాజా షైన్ లో 125 సీసీ పీజీఎం-ఎఫ్ఐ హెచ్ఈటీ ఇంజిన్ అమర్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఎన్ హాన్స్ డ్ స్మార్ట్ పవర్ (ఈఎస్పీ) ఫీచర్ షైన్ కు అదనపు సొగసు అని వివరించారు. వినియోగదారుల అంచనాలను అందుకుంటూ అనేక సంవత్సరాలుగా షైన్ 125 సీసీ విభాగాన్ని పునర్నిర్వచించిందని హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) సీఈఓ అట్సుషి ఒగాటా తెలిపారు.