ఇదొక రికార్డు.. దిల్ రాజు నిర్మిస్తున్న ఐదు సినిమాలు ఈ రోజు సెట్స్ పైనే!
- లాక్ డౌన్ తర్వాత దూకుడు పెంచిన దిల్ రాజు
- ఈరోజు సెట్స్ పై ఉన్న ఐదు సినిమాలు
- ఇటీవలే 50వ పుట్టినరోజు జరుపుకున్న దిల్ రాజు
కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దూకుడు పెంచారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ పట్టాలెక్కించారు. ఈరోజు ఏకంగా 5 సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఆయనకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాలను దిల్ రాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న దిల్ రాజు సినిమాల్లో 'వకీల్ సాబ్', 'ఎఫ్3', 'థాంక్యూ', 'పాగల్', 'హుషారు' చిత్రాలు ఉన్నాయి.
మరోవైపు దిల్ రాజు ఇటీవలే 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, యష్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, రామ్, అఖిల్, నితిన్, సమంత, రాశీ ఖన్నా, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు హాజరై దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు.