రైతులకు మద్దతుగా కాలినడకన రాహుల్ గాంధీ... రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం

  • వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలు
  • మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
  • రేపు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నడక
  • 2 కోట్ల మంది సంతకాలతో కూడిన వినతిపత్రం సమర్పణ
  • వ్యాక్సిన్ అంశంలోనూ విమర్శలు గుప్పించిన రాహుల్
జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. రైతు చట్టాలు వద్దంటూ దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది సంతకాలు చేయగా, ఆ వినతి పత్రాన్ని రాహుల్ గాంధీ రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సమర్పించనున్నారు. అయితే, ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు రాహుల్ గాంధీ కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అటు, కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. మనదేశంలో కరోనా వ్యాక్సిన్ ఇంకెన్నాళ్లకు వస్తుందని నిలదీశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఇప్పటికే ప్రారంభమైందని, భారత్ లో మాత్రం వ్యాక్సిన్ పంపిణీపై ఎలాంటి కదలిక లేదని ఆరోపించారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వ్యాక్సిన్ వస్తుంది మోదీ గారూ? అంటూ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.


More Telugu News