సవాల్ కు ప్రతి సవాల్... సత్యప్రమాణం చేసేందుకు బిక్కవోలు ఆలయానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే
- అనపర్తిలో సత్తి సూర్యనారాయణరెడ్డి వర్సెస్ రామకృష్ణారెడ్డి
- అవినీతిపై పరస్పర ఆరోపణలు
- దైవం ముందు ప్రమాణం చేస్తానన్న సూర్యనారాయణరెడ్డి
- సవాల్ స్వీకరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
- అప్రమత్తమైన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యుడు సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య విమర్శల పర్వం పతాకస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసుకున్న ఈ నేతలు తమ వ్యాఖ్యలపై బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో సత్యప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రమాణం చేసి నిజాయతీ నిరూపించుకోవాలని పరస్పరం సవాళ్లు విసురుకున్నారు.
ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు గణపతి ఆలయంలో సత్యప్రమాణానికి వస్తానని, దేవుడి ముందు తానేంటో నిరూపించుకుంటానని వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సవాల్ చేయగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆ సవాల్ ను స్వీకరించారు.
కాగా, ఈ ఇద్దరు నేతల సత్యప్రమాణానికి పోలీసుల నుంచి అనుమతి లభించడంతో రాజకీయం రంజుగా మారింది. అయితే, పోలీసులు బిక్కవోలులో 144 సెక్షన్ విధించారు. పోలీసు నిబంధనలు అమల్లో ఉన్నందున నేతలు తమ వెంట ఎవరినీ తీసుకురావొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయానికి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.