ఫెర్టిలైజర్ ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీ.. ఇద్దరి మృతి.. మరో 15 మందికి అస్వస్థత
- ఉత్తరప్రదేశ్‌లోని ఐఎఫ్ఎఫ్సీవోలో ఘటన
- అమ్మోనియా, యురియా యూనిట్లలో పనులు జరుగుతుండగా ప్రమాదం
- యోగి ఆదిత్యనాథ్ సంతాపం
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఫెర్టిలైజర్ ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్‌పూర్‌లోని ఆర్ ప్లాంట్‌లో అమ్మోనియా వాయువు లీకేజీ కావడంతో దాని అసిస్టెంట్ మేనేజర్ వీపీ సింగ్, డిప్యూటీ మేనేజర్ అభయానంద్ మృతి చెందగా, మరో 15 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఐఎఫ్ఎఫ్‌సీఓ సంస్థలో అమ్మోనియా, యురియా యూనిట్లలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. లీకేజీ మొదలైనట్లు మొదట గుర్తించకపోవడంతో అది మరింత ఉద్ధృతంగా పెరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.