నిరంతర సంస్కరణశీలిగా మన దేశ చరిత్రలో పీవీ నిలిచిపోతారు: కేసీఆర్
- ఆయన సంస్కరణల ఫలితాన్ని మన దేశం అనుభవిస్తోంది
- అనేక రంగాల్లో విశిష్ట సేవలను అందించిన మహనీయుడు పీవీ
- ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి
దివంగత ప్రధాని పీవీ నరసింహారావును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంతర సంస్కరణశీలిగా మన దేశ చరిత్రలో పీవీ నిలిచిపోతారని అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఆయన ప్రవేశపెట్టి, అమలుచేసిన సంస్కరణల ఫలితాన్ని ఈరోజు మన దేశం అనుభవిస్తోందని చెప్పారు.
దేశ అంతర్గత భద్రత, విదేశాంగ వ్యవహారాల్లో ఆయన అవలంబించిన దృఢవైఖని దేశ సార్వభౌమత్వాన్ని పటిష్టపరిచిందని కొనియాడారు. అనేక రంగాల్లో విశిష్టమైన సేవలను అందించిన మహనీయుడు పీవీకి ఘన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి పీవీ అని కొనియాడారు.