దక్షిణాదిన ఓ దర్శకుడు తనతో గడపాలన్నాడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాను: బాలీవుడ్ నటి డొనాల్‌ బిష్ట్‌

  • అప్పట్లో ముంబైలో ఓ ప్రాజెక్ట్‌ నుంచి నన్ను తీసేశారు
  • దీంతో ముంబైపై నమ్మకంపోయి దక్షిణాదిన ట్రై చేశాను
  • ఆడిషన్లకు వెళ్తూనే ఉన్నాను
  • ఓ దర్శకుడు తనకు‌ అవకాశం ఇస్తానని చెప్పి, తనతో గడపాలన్నాడు
  • దక్షిణాదిని విడిచిపెట్టి తిరిగి ముంబైకి వచ్చాను
సినీ పరిశ్రమలో వేధింపుల గురించి మరో నటి ధైర్యంగా మాట్లాడింది. వరుసగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న డొనాల్‌ బిష్ట్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రారంభంలో తనను ఓ షో కోసం ఎంపిక‌ చేశారని, దీంతో డేట్స్‌ ఇచ్చానని, రెమ్యునరేషన్‌ కూడా ఫైనల్‌ అయ్యిందని చెప్పింది.

అయితే, ఉన్నట్టుండి ఆ ప్రాజెక్ట్‌ నుంచి తనను తీసేశారని, ఆ చానెల్ వారు‌ వేరే నటిని ఎంపిక చేశారని తెలిపింది. దీంతో పరిశ్రమ, ముంబైలోని వ్యక్తులు అంటేనే నకిలీ అనే అభిప్రాయానికి తాను, తన కుటుంబ సభ్యులు వచ్చామని చెప్పింది. అయితే, తనకు నటన మీద ఉన్న పిచ్చి తగ్గలేదని చెప్పింది.

దీంతో తాను ఆడిషన్లకు వెళ్తూనే ఉన్నానని చెప్పింది. ఇలా సినిమాల్లో ఒక్క ఛాన్స్ కోసం ప్రయత్నిస్తుండగా దక్షిణాదిలో ఇంతకంటే భయంకరమైన అనుభవం ఎదురయ్యిందని ఆమె తెలిపింది. ఓ దర్శకుడు తనకు‌ అవకాశం ఇస్తానని చెప్పాడని, అయితే, తనతో గడపాలని అన్నాడని వెల్లడించింది. దీంతో తాను వెంటనే ఆ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది.

ఆ వెంటనే తాను దక్షిణాదిని విడిచిపెట్టి తిరిగి ముంబైకి వచ్చానని తెలిపింది. తన ప్రతిభను గుర్తించిన దర్శకులు అవకాశాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది. తాను తన కష్టాన్నే నమ్ముకున్నానని, సినీ పరిశ్రమలోకి రావడానికి బాగా శ్రమించానని తెలిపింది. చివరకు సరైన మార్గంలోనే సినీ పరిశ్రమంలోకి వచ్చానని చెప్పుకొచ్చింది.


More Telugu News