యూట్యూబర్ ను పెళ్లాడిన టీమిండియా క్రికెటర్ చహల్
- ధనశ్రీ వర్మతో చహల్ వివాహం
- గురుగ్రామ్ లో ఓ రిసార్ట్ లో జరిగిన పెళ్లి
- కొంతకాలంగా ప్రేమలో ఉన్న చహల్, ధనశ్రీ
- యూట్యూబ్ లో వీడియోలు చూసి ప్రేమలో పడిన చహల్
టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఓ ఇంటివాడయ్యాడు. యూట్యూబ్ వీడియోలతో ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో చహల్ పెళ్లి నేడు ఘనంగా జరిగింది. గురుగ్రామ్ లోని కర్మా లేక్ రిసార్ట్ ఈ వివాహానికి వేదికగా నిలిచింది. చహల్, ధనశ్రీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. యూట్యూబ్ లో ధనశ్రీ డ్యాన్స్ వీడియోలు చూసిన ఈ బక్కపలుచని క్రికెటర్ ప్రేమలో పడిపోయాడు.
తమది స్టూడెంట్-టీచర్ అనుబంధంలా మొదలైందని అప్పట్లో ధనశ్రీ మీడియాకు తెలిపింది. కొద్దికాలంలోనే తాము ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టు తెలుసుకున్నామని పేర్కొంది. గత ఆగస్టులోనే వీరికి రోకా వేడుక జరిగింది. ఆ సమయంలో తన ప్రపోజల్ గురించి చహల్ సోషల్ మీడియాలో వెల్లడించాడు.