సచిన్ తనయుడి బౌలింగ్ ను చితకబాదిన సూర్యకుమార్ యాదవ్

  • త్వరలోనే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
  • ముంబయిలో సన్నాహక మ్యాచ్ లు
  • బీ- టీమ్, డీ-టీమ్ మధ్య మ్యాచ్
  • 47 బంతుల్లోనే 120 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్
  • అర్జున్ టెండూల్కర్ వేసిన ఓవర్లో 21 రన్స్ చేసిన వైనం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి సన్నాహకంగా ముంబయి జట్టు ఆటగాళ్ల మధ్య ప్రాక్టీసు మ్యాచ్ లు నిర్వహించారు. ఇందులో యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ బీ-టీమ్ కు సారథ్యం వహించాడు. అయితే, డీ-టీమ్ తో మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. సూర్య ప్రతాపానికి గురైన వారిలో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నాడు.

అర్జున్ విసిరిన ఓ ఓవర్లో సూర్య శివాలెత్తాడు. ఆ ఓవర్లో 21 పరుగులు పిండుకున్నాడు. అప్పటివరకు ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసిన అర్జున్ ఆ ఓవర్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తమ్మీద ఈ టీ20 మ్యాచ్ లో అర్జున్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులిచ్చాడు. ఓ వికెట్ కూడా తీశాడు.


More Telugu News