భారత్ లో పది లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కాలుష్యం

భారత్ లో పది లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కాలుష్యం
  • లాన్సెట్ నివేదికలో వెల్లడి
  • 2019లో 1.67 మిలియన్ల మరణాలు
  • 2017తో పోల్చితే గణనీయంగా పెరిగిన మృతుల సంఖ్య
  • భయంకర వ్యాధులకు కారణమవుతున్న కాలుష్యం
  • తీవ్ర కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్ కతా, ముంబయి
భారత్ లో వాతావరణ కాలుష్యంపై 'ది లాన్సెట్' నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గతేడాది దేశంలో వాయు కాలుష్యం కారణంగా 1.67 మిలియన్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 2017 కంటే 2019లో అత్యధికులు కాలుష్యం బారినపడి కన్నుమూశారని వివరించింది.

కాలుష్యంగా కారణంగా 2017లో 1.24 మిలియన్ల మరణాలు సంభవించాయని పేర్కొంది. ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్, హృద్రోగాలు, పక్షవాతం, మధుమేహం, గర్భస్థ శిశు దోషాలు, కంటిలో శుక్లాలు వంటి సమస్యలకు కాలుష్యమే ప్రధాన హేతువని లాన్సెట్ వెల్లడించింది.

కాగా, ప్రపంచంలోని అత్యంత తీవ్ర కాలుష్య నగరాల జాబితాలో భారత్ లోని ఢిల్లీ, కోల్ కతా, ముంబయి కూడా ఉన్నాయని స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ వెల్లడించింది.


More Telugu News