ముంబయిలో కరోనా నియమావళి గురించి అవగాహన లేదు: సురేశ్ రైనా
- ముంబయిలోని ఓ పబ్ లో రైనా అరెస్ట్
- బెయిల్ పై విడుదల
- వివరణ ఇచ్చిన రైనా మేనేజ్ మెంట్ టీమ్
- ఓ ఫ్రెండ్ డిన్నర్ కు పిలిస్తే వెళ్లాడని వివరణ
- వేళల గురించి తెలియదని స్పష్టీకరణ
ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనా గతరాత్రి ముంబయిలోని డ్రాగన్ ఫ్లై పబ్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రైనా సహా 34 మందిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై రైనా బెయిల్ పై విడుదల అయ్యాడు. దీనిపై రైనా వివరణ ఇచ్చాడు. ముంబయిలో కరోనా నియమావళి గురించి సరైన అవగాహన లేనందువల్లే ఈ ఘటన జరిగిందని రైనా తరఫున ఆయన మేనేజ్ మెంట్ టీమ్ స్పందించింది.
ఇదేమీ కావాలని చేసింది కాదని, ఇదో దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది. పబ్ లు ఎన్నింటి వరకు తెరిచి ఉంచుతారన్న విషయం తెలియకనే రైనా అరెస్ట్ అయ్యాడని వివరించింది. ఓ షూటింగ్ కోసం రైనా ముంబయి వచ్చాడని, ఓ స్నేహితుడు పిలవడంతో విందుకు వెళ్లాడే తప్ప, రైనా కావాలని తప్పుచేయలేదని ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.