ఆత్మహత్య చేసుకున్న ఒంగోలు దివ్యాంగురాలి కుటుంబానికి సీఎం జగన్ ఆర్థిక సాయం
- ఒంగోలులో ఆత్మహత్యకు పాల్పడిన దివ్యాంగురాలు
- రూ.5 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్
- గుంటూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం
- యువకుడి వేధింపుల ఫలితం
- రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న సీఎం జగన్
ఇటీవల భువనేశ్వరి అనే దివ్యాంగురాలు ఒంగోలులో విచారకర పరిస్థితుల్లో తన మూడు చక్రాల సైకిల్ పైనే ఆత్మహత్య చేసుకుంది. వార్డు వలంటీర్ గా పనిచేస్తున్న భువనేశ్వరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆత్మహత్య చేసుకున్న భువనేశ్వరి కుటుంబానికి సీఎం జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమె కుటుంబానికి రూ.5 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అటు, గుంటూరు జిల్లా కొర్రపాడులో ఓ యువకుడి వేధింపులకు బలైన 10వ తరగతి విద్యార్థిని సౌమ్య కుటుంబానికి రూ.10 లక్షలు ప్రకటించారు. దీనిపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. సీఎం జగన్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారని అన్నారు. సీఎం జగన్ మానవీయ కోణం మరోసారి వ్యక్తమైందని పేర్కొన్నారు.