నల్ల జెండాలు చూపించిన రైతులు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం!
- హర్యానా ముఖ్యమంత్రి కట్టర్ ను అడ్డుకున్న రైతులు
- అంబాలకు వెళ్తుండగా చోటుచేసుకున్న ఘటన
- రైతులు రోడ్డును బ్లాక్ చేయడంతో వెనుదిరిగిన సీఎం
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. ఆయన అంబాలాకు వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు... ముఖ్యమంత్రి కాన్వాయ్ ని అడ్డుకుని నల్ల జెండాలు చూపించారు.
ఈ ఘటనతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. సీఎం కాన్వాయ్ కి దారి ఇవ్వాలంటూ రైతులను వారు బతిమాలారు. ఈ సందర్భంగా నల్లజెండాలతో పాటు, కర్రలను కూడా రైతులు చూపించారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డును బ్లాక్ చేసి ఉండటంతో... సీఎం కాన్వాయ్ వెనుదిరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు అంబాలాకు ఖట్టర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ నెల 1న కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అంబాలా సమీపంలోని ఒక గ్రామంలో ఆయనకు కూడా రైతులు నల్ల జెండాలను చూపించారు. కటారియా అంబాలా నుంచి ఎంపీగా గెలుపొందడం గమనార్హం.