ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపిన మోదీ

  • మోదీకి 'లీజియన్ ఆఫ్ మెరిట్' ప్రకటించిన అమెరికా
  • సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
  • ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి ఇది ప్రతీక అని వ్యాఖ్య
తనకు అమెరికా అత్యున్నత పురస్కారం 'లీజియన్ ఆఫ్ మెరిట్'ను ప్రకటించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను మరింత పటిష్టపరిచేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నానని చెప్పారు.

ఇండియా-అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది ప్రతీక అని మోదీ తెలిపారు. 21వ శతాబ్దం ప్రపంచానికి ఎన్నో సవాళ్లు విసిరిందని... మానవాళి ప్రయోజనాల కోసం ప్రపంచ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే మన లక్ష్యం కావాలని అన్నారు. ఇరు దేశాల బంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని... దేశంలోని 130 కోట్ల మంది తరపున ఈ విషయాన్ని చెపుతున్నానని తెలిపారు.


More Telugu News