బోరిస్ జాన్సన్ భారత్ రావొద్దంటూ బ్రిటన్ ఎంపీలకు లేఖలు రాయాలని రైతు సంఘాల నిర్ణయం

  • నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన కేంద్రం
  • వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులు
  • జనవరి 26న భారత్ రానున్న బ్రిటీష్ ప్రధాని
  • మద్దతు కోరనున్న వైనం
  • కేంద్రం లేఖపై రేపు చర్చిస్తామన్న రైతు సంఘాలు
  • ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయం
జనవరి 26న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెలరోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతు సంఘాలు... రిపబ్లిక్ డే వేడుకలకు బోరిస్ జాన్సన్ భారత్ రావొద్దంటూ బ్రిటన్ ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయించాయి. తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నాయి. ఢిల్లీలో రైతు సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోపక్క, కేంద్రం రాసిన లేఖపై రేపు చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కేంద్రం రాసిన లేఖలో కొత్త అంశాలేవీ లేవని పేర్కొన్నారు. రేపు చర్చలకు వెళ్లాలా, వద్దా? అనేదానిపైనా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్రం వైఖరి నేపథ్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.


More Telugu News