బ్రిటన్ నుంచి చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్... భారత్ లో 'కొత్త' కలకలం!
- బ్రిటన్ లో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్
- వేగంగా వ్యాపిస్తున్న తీరు
- బ్రిటన్ విమానాలు రద్దు చేసిన భారత్ సహా పలు దేశాలు
- బ్రిటన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నై వచ్చిన వ్యక్తి
- నమూనాలను పూణే వైరాలజీ ఇన్ స్టిట్యూట్ కు పంపిన అధికారులు
అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ అంటే ఇతర దేశాలు హడలిపోతున్నాయి. బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడమే అందుకు కారణం. భారత్ సహా అనేక దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో, బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
బ్రిటన్ నుంచి ఢిల్లీ వచ్చిన సదరు వ్యక్తి అక్కడి నుంచి చెన్నై చేరుకున్నాడు. కరోనా సోకినట్టు తేలడంతో అతడిని క్వారంటైన్ లో ఉంచారు. బ్రిటన్ లో రూపాంతరం చెందిన కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ఆ వ్యక్తికి సోకింది కరోనా కొత్త రకం వైరస్సా? కాదా? అనేది పరీక్షల అనంతరం వెల్లడి కానుంది.