సిస్ట‌ర్ అభయ హ‌త్య కేసులో తీర్పు.. నిందితులను దోషులుగా ప్రకటించిన సీబీఐ కోర్టు

  • కేరళలో 1992లో సిస్ట‌ర్ అభయ హత్య 
  • ఫాద‌ర్ థామ‌స్ కొట్టూర్‌, న‌న్ సెఫీ దోషులు
  • వారిద్దరికీ ఈ నెల 23న శిక్షలు ఖరారు
  • క్రైస్త‌వ స‌న్యాసినితో వారిద్దరు ఉండగా చూసిన అభయ
  • ఎవరికైనా చెబుతుందని హత్య
కేర‌ళలో 28 ఏళ్ల క్రితం కలకలం రేపిన సిస్ట‌ర్ అభయ హ‌త్య కేసులో ఫాద‌ర్ థామ‌స్ కొట్టూర్‌, న‌న్ సెఫీలను ఈ రోజు సీబీఐ కోర్టు దోషులుగా తేల్చుతూ తీర్పు ఇచ్చింది. వారిద్దరికీ ఈ నెల 23న శిక్షలు ఖరారు కానున్నాయి. 1992లో సిస్ట‌ర్ అభయ కేసు సంచలనం రేపింది. కేర‌ళ‌లోని బీఎంసీ కాలేజీలో ఆమె సైకాల‌జీ కోర్సు చేస్తూ హాస్టల్ లో ఉంటోన్న సమయంలో థామ‌స్ కొట్టూరు సైకాల‌జీ అధ్యాప‌కుడిగా ఉన్నారు.

మార్చి 27న తెల్ల‌వారుజామున సిస్ట‌ర్ అభ‌య త‌న హాస్ట‌ల్ నుంచి కిచెన్ వైపు వెళ్లగా, అక్కడ ఓ క్రైస్త‌వ స‌న్యాసినితో థామ‌స్ కొట్టూర్‌, జోస్ పుత్రుక్క‌యిల్  అభ్యంత‌ర‌క‌ర రీతిలో క‌నపడ్డారు. దీంతో తమ వ్యవహారం గురించి సిస్టర్ అభయ ఎవరికైనా చెబితే తమ పరువుపోతుందని భయపడిన థామ‌స్ కొట్టూర్‌, జోస్ పుత్రుక్క‌యిల్ భావించారు. వెంటనే ఆమెను చంపేసి బావిలో పడేయడంతో దీనిపై 28 ఏళ్లుగా విచారణ కొనసాగింది.


More Telugu News