అయ్యా డీజీపీ సవాంగ్ గారు.. మరోసారి హైకోర్టు నుంచి పిలుపు మీకు తప్పదేమో?: వర్ల రామయ్య
- గుంటూరు పోలీసులు ద్విచక్ర వాహనాలకు అధికార పార్టీ రంగులు వేశారు
- గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఇదే రంగులు వేశారు
- వారికి రంగు పడింది
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయవద్దంటూ అప్పట్లో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ వైసీపీపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. తాజాగా, గుంటూరులో పోలీసుల ద్విచక్ర వాహనాలకు వైసీపీ రంగులు వేసి, వాటిని ప్రారంభించారని తెలుపుతూ మరోసారి హైకోర్టు నుంచి పిలుపుతప్పదని చురకలంటించారు.
‘అయ్యా.. డీజీపీ సవాంగ్ గారు, గుంటూరు పోలీసులు ద్విచక్ర వాహనాలకు అధికార పార్టీ రంగులు వేసి వారి స్వామి భక్తి చాటుకున్నారు. గతంలో, ప్రభుత్వ కార్యాలయాలకు ఇదే రంగులు వేస్తే, వారికి రంగు పడింది. ఇప్పుడు, ఈ పోలీసు వాహనాలకు ఆ రంగులు తొలగించకపోతే, మరోసారి హైకోర్టు పిలుపు మీకు తప్పదేమో?’ అని వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.