45 ఆవులతో వెళుతున్న లారీని అడ్డుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్
- లారీలో అక్రమంగా ఆవుల తరలింపు
- మహారాష్ట్ర నుంచి బహదూర్‌పురకు ఆవుల తరలింపు
- చౌటుప్పల్ చెక్‌పోస్ట్ వద్ద వెంబడించి పట్టుకున్న ఎమ్మెల్యే
- పోలీసులపై మండిపాటు
బీజేపీ తెలంగాణ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో 45 ఆవులను రక్షించారు. అక్రమంగా లారీలు, ట్రక్కుల్లో తరలిస్తోన్న ఆవులను ఇప్పటికే ఆయన చాలాసార్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. గత రాత్రి మహారాష్ట్ర నుంచి అక్రమంగా బహదూర్‌పుర తరలిస్తోన్న ఆవుల లారీని గత రాత్రి చౌటుప్పల్ చెక్‌పోస్ట్ వద్ద వెంబడించి మరీ పట్టుకున్నారు.
అనంతరం ఆ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు డబ్బులకు అలవాటుపడి ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పోలీసుల తీరుపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆవులను వధించటం నేరమని ఆయన వ్యాఖ్యానించారు. తాము గోవధపై బహదూర్ పుర మునిసిపల్ కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.